అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బాబాపూర్ సర్పంచ్ సత్యవేణి రాజన్న

0
7

• గర్భిణీ స్త్రీకి ఘనంగా శ్రీమంతం కార్యక్రమం

• చిన్నారులతో ఆడిపాడి బాల్యాన్ని గుర్తుచేసుకున్న సర్పంచ్

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మండలంలోని  బాబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాబాపూర్-2 అంగన్‌వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శ్రీ సత్యవేణి రాజన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహించిన గర్భిణీ కి శ్రీమంతం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆశీర్వదించారు.

అనంతరం సర్పంచ్ మాట్లాడుతు. అంగన్‌వాడీ కేంద్రానికి రావడం, చిన్నారులతో కలిసి గడపడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పిల్లలతో కలిసి సరదాగా ఆటపాటల్లో పాల్గొని తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది సేవలను ఆయన అభినందించారు. అనంతరం  సర్పంచ్ రాజన్న గారిని అంగన్వాడీ సిబ్బంది ఘనంగా సన్మానించారు 

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ చునార్కర్ వనిత, హెల్పర్ ఈ. సరోజ, బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు మరియు అంగన్‌వాడీ చిన్నారులు పాల్గొన్నారు.