11వ వార్డులో లబ్ధిదారులకు నూతన పింఛన్ ప్రొసీడింగ్స్ పంపిణీ

0
5

🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ ప్రొసీడింగ్స్ (మంజూరు పత్రాలు) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కస్తూరి నిఖిల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామయ్య, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. పింఛన్ ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.