ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీలో పలు నూతన నియామకాలను రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి సువర్ణ సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్పర్సన్ ఇరుకుల్ల మంగను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి సువర్ణ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి మరియు మహిళల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు రాజకీయాల్లో చురుగ్గా మరియు ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆమె సూచించారు.
తమపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర అధ్యక్షురాలికి ఇరుకుల్ల మంగ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.









