🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ పంచాయతీలో ఈరోజు ఆసరా పింఛన్ల పంపిణీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ డీసీసీ (DCC) అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం గ్రామ మహిళా సంఘాల అవసరాల కోసం నిర్మించనున్న నూతన సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు, మహిళా సంఘాల బలోపేతానికి సమైక్య భవన నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో బాబాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మంగ గారు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్ గారు, గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న గారు, ఉప సర్పంచ్ ఐలవేణి కిష్టయ్య గారు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
వీరితో పాటు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి దేవరాజ్, చునార్కర్ వసంతరావు, ఇందులాల్ నాయక్, వాసుదేవ్, శివప్రసాద్, దీపక్, గోపాల్ నాయక్, కావాల్కర్ శుభాష్, అబాజీ, విలాస్, మహిళా సంఘాల సభ్యులు, పింఛన్ లబ్ధిదారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.









