మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్, ACC ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు.
మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, ఉదయం అల్పాహారం, పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, వాటి అవసరాలు మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో డిసెంబర్ నెలలో 75 బెంచీలు అందిస్తానని, అలాగే వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభం నాటికి నూతన పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
మంచిర్యాల నియోజకవర్గంలోని అవసరమైన ప్రభుత్వ పాఠశాలలకు కూడా బెంచీలు అందించి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
“ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య.. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మెరుగైన వసతులు.. ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, MEO మాలతి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, స్థానిక కార్పొరేటర్ గంగవరపు వెంకటేశ్వర్లు, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









