జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఆసిఫాబాద్ గురుకుల విద్యార్థుల ఎంపిక

0
0

🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ ప్రతినిధి): ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. కళాశాల విద్యార్థులు దుర్గం వర్షిత్, డోంగ్రే వెంకటేశ్ జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటేందుకు అర్హత సాధించారు.

ఈ నెల 24వ తేదీ నుంచి పంజాబ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో వీరు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం వెల్లడించారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం, పీడీ కోట యాదగిరి, పీఈటీ ప్రసాద్, సాఫ్ట్ బాల్ సంఘం సెక్రటరీ కిరణ్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి విజయం సాధించాలని ఆకాంక్షించారు.