తిరుపతి రెడ్డి చేతుల మీదుగా నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 2 కెనాల్ పనులకు సుల్తాన్ పూర్ గ్రామంలో భూమి పూజ
భారత్ అవాజ్ కొడంగల్ నవంబర్ 20-
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నారాయణపేట–మక్తల్–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-II గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులకు సుల్తాన్పూర్ గ్రామంలో ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులకు శ్రీకారం చుట్టారు.బీటలు వారిన బీడు భూములకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంకల్పంలో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు తిరుపతి రెడ్డి తెలిపారు.ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాల బీడు భూములకు నీరంది,భూ అంతర్గత జలాలు పెరిగి బోరు బావుల నుండి పుష్కళంగా నీరు వస్తుంది అని రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి ,కాడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి,తాండూర్ ఆర్డీఓ,దౌల్తాబాద్ ఎంఆర్ఓ,డిప్యూటీ ఎంఆర్ఓ,ఇరిగేషన్ అధికారులు,రాఘవ కన్స్ట్రక్షన్ ఎండీ, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోడి వెంకట్ రెడ్డి,దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రావు ఉపాధ్యక్షులు జయ నర్సింహా,జంగం వీరన్న, సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ బాలపోల్లా వెంకటమ్మ,ఉప సర్పంచ్ గుడ్డిపిల్ల మహేశ్వరి వెంకటప్ప,బాలంపేట్ సర్పంచ్ ప్రమోద్ రావ్,అంతరం సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు బాలపోల్లా శ్రీనివాస్,దాసరి హన్మంతు,కోట్ల చంద్రప్ప,బి అనుసుజా, హరిజన్ వెంకటప్ప, కొండ లక్ష్మి,లష్మిబాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పెద్ద వెంకట్, గోవర్ధన చారి సూర్యమోహన్ ఈడిగి సాంబయ్య గౌడ్ఎంకప్ప మండల ముఖ్య కూర వెంకట్ రాములు కోటం రాములు, నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










