ఖురవి మండలం బేగంపేట తండాలో జరిగిన వివాహ వేడుకలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తల్లిదండ్రుల అండలేని మహిళ వివాహానికి తండా నాయకులు, గ్రామ పెద్దలు ముందుకు వచ్చి తమవంతు సహాయ సహకారాలు అందించారు. సుమారు 30 మంది కలిసి ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ రాంచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
సమాజంలో మానవత్వం, సేవాభావం చాటిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.









