కనకదుర్గమ్మకు నిజామాబాద్ భక్తుడి భారీ స్వర్ణ కానుక
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి నిజామాబాద్‌కు చెందిన భక్తుడు తోడుపునూరి శ్రీనివాస్ భారీ స్వర్ణ కానుకను సమర్పించారు. మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న ఆయన, తన భక్తిని చాటుకుంటూ 107.500 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందజేశారు.
పచ్చలు, కెంపులు పొదిగిన ఈ ఆభరణం విలువ మార్కెట్లో సుమారు ₹16.70 లక్షలు ఉంటుందని అంచనా. లోక కల్యాణం కోసం ఈ కానుకను సమర్పించినట్లు పేర్కొన్న దాత, ప్రచారానికి దూరంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అధికారులు దాతకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసి గౌరవించారు.










