తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త |

0
2

తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త: వ్యవస్థీకృత నేర ముఠాల వలపై అప్రమత్తత అవసరం

ప్రేమ, స్నేహం పేరుతో అమాయకపు అమ్మాయిలను వలవేసి వేటాడుతున్న మృగాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీలు, కోచింగ్ సెంటర్లే వేదికగా 15-17 ఏళ్ల బాలికలను టార్గెట్ చేస్తూ, నమ్మకం కలిగించి, ఆపై మత్తుమందు ఇచ్చి అశ్లీల వీడియోలు రికార్డ్ చేస్తున్న ముఠాలు బయటపడుతున్నాయి.

ఈ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేయడం, ఇతర వ్యక్తుల దగ్గరకు పంపడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న వ్యవస్థీకృత నేరం. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, వారికి అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత.