నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వ అమానుషం: నలుకుర్తి రమేష్
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కుల్లో నడిచే ప్రజలపై ఏడాదికి ₹720 “నడక పన్ను” విధించడాన్ని వైయస్సార్సీపి ఎస్సి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ తీవ్రంగా ఖండించారు.
ప్రజారోగ్యాన్ని కాపాడాల్సింది పోయి, నడకపై కూడా పన్ను వేయడం కూటమి ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని మండిపడ్డారు. గాలికి, నీటికి కూడా పన్ను వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. వెంటనే ఈ అప్రజాస్వామిక నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
*నలుకుర్తి రమేష్*










