*టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*
తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన వి.ఎన్.మొబైల్స్ సంస్థ మంగళవారం టీటీడీకి రూ.95 వేలు విలువైన ఫ్రాన్క్లిన్ ఈవీ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ అప్పల నాయుడు, శ్రీ వెంకట రమణలు శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులుకు వాహనం తాళాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీఐ శ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు.










