ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి

0
5

ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది.

కార్మిక సంఘాల ప్రతినిధులతో రేపు (శుక్రవారం) చర్చలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని మంత్రుల బృందానికి చెప్పారు