మదనపల్లె: రహదారి దుస్థితిపై స్థానికుల ఆగ్రహం.

0
4

మదనపల్లెలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కోమటివాని చెరువుపై ఉన్న రహదారి అధ్వాన్న స్థితిపై స్థానికులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.

గుంతలతో నిండిపోయిన ఈ మార్గంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బహుజన యువసేన సభ్యులు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను పూడ్చి తాత్కాలికంగా రహదారిని సరిచేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.