అన్నమయ్య జిల్లా: డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్.

0
2

అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు పోలీసులు సోమవారం నూతన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, పట్టణ శివారు ప్రాంతాలు, కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు.

పోలీసు వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా గగనతలం నుంచి పర్యవేక్షిస్తూ పేకాట శిబిరాలు, నాటుసారా తయారీ, గంజాయి రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడ దాక్కున్నా నేరస్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.