అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదానానికి సోమవారం పలమనేరు మార్కెట్ నుంచి 12 టన్నుల కాయగూరలు వితరణ చేశారు.
పూసల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంగాల శివరామ్ తన వంతు సహాయంగా కాయగూరలు కొనుగోలు చేసి అందజేశారు. భక్తులు స్వయంగా కాయగూరలను రధంలో నింపి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం మహాదానం అని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.








