శభాష్… లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
5

మంగళగిరిలో జరిగిన టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. “శభాష్ లోకేశ్” అంటూ ఆయన పనితీరును కొనియాడారు.

కేవలం సిఫార్సులతో కాకుండా, కష్టపడి పనిచేసి పదవులు వస్తాయని లోకేశ్ నిరూపించారని ప్రశంసించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను సమన్వయం చేయడంలో, ప్రస్తుతం 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయడంలో లోకేశ్ కృషి అమోఘమన్నారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో కూడిన ఈ నూతన కమిటీ రాష్ట్ర పునర్నిర్మాణానికి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.