పుంగనూరు పట్టణంలో బోండాలు, బజ్జీలు అమ్ముకునే మహిళను తోఎన్ఎస్ పేటకి చెందిన అబ్రార్ పరిచయం చేసుకుని, మాయమాటలు చెప్పి ఐదేళ్లుగా సహజీవనం చేశాడు.
అయితే, అబ్రార్‌కు ఇప్పటికే పెళ్లయింది. విషయం తెలుసుకున్న మహిళ నిలదీయగా, ఆమెపై దాడి చేసి గాయపరిచి, ఇంట్లోని ఫ్రిడ్జ్, టీవీ, బీరువా వంటి సుమారు రూ. 40 వేల విలువైన సామాగ్రిని ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కె.వి. రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.










