పుంగనూరు: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి జైలు శిక్ష

0
0

అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి బుధవారం జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే ములకలచెరువు, బురకాయలకోటల్లో 3 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీలలో నిందితుడు పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించి అక్టోబర్ 2025లో అప్పటి ఎస్సై నరసింహుడు అరెస్టు చేశారు.

నేరం రుజువు కావడంతో తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి జ్ కోర్టు న్యాయాధికారి బుధవారం అతనికి 9 నెలల జైలుశిక్ష విధించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదు అన్నారు# కొత్తూరు మురళి.