కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్తిని, విద్యార్ధి కి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు
కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా, పరీక్షల్లో అనుతీర్ణులైన విద్యార్థుల పట్ల కూడా ఆయన ఆత్మీయంగా స్పందిస్తూ, ఒకసారి ఫెయిల్ కావడం జీవితానికి ముగింపు కాదని, అది విజయానికి మొదటి అడుగని పేర్కొన్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి, వారికి ధైర్యం చెప్పి, మళ్లీ పరీక్షలు రాయడానికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.విద్యార్థులు నిరుత్సాహపడకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరని ఎర్రకోట రాజీవ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.










