పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ

0
3

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. శిథిల వ్యవస్థలో ఉన్న పోలీస్ భవన సముదాయం, స్టేషన్ రికార్డులను పరిశీలించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఐ సుబ్బరాయుడును ఆదేశించారు. మహిళలు, బాలికలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు కొత్తూరు మురళి.