మదనపల్లె అర్బన్ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఈనెల 7వ తేదీలోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం డీఈవో సుబ్రమణ్యం సూచించారు.
పాఠశాలల లాగిన్లలో దరఖాస్తు అందుబాటులో ఉంటుందని, రీ కౌంటింగ్‌కు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు రూ. 1000 చెల్లించి దరఖాస్తు చేయాలని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.









