అన్నమయ్య: మస్కట్‌లో మహిళ ఆవేదన.. స్పందించిన పవన్.

0
4

వాల్మీకిపురానికి చెందిన దూదేకుల షెహనాజ్ మస్కట్‌లో వేధింపులు తాళలేక బాధపడ్డ విషయం తెలిసిందే. తనని స్వదేశానికి రప్పించాలని ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, ఎన్డీఏ కూటమిని కోరింది.

దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, షెహనాజ్‌ను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.