అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నార్లు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర నేత పద్మనాభరెడ్డి ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు.
మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, నకిలీ ఉత్పత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరారు.









