శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్.

0
1

సర్జరీ తర్వాత కోలుకుంటున్న పవన్ కల్యాణ్

గత నెల ఏప్రిల్ 18న అపోలో హాస్పిటల్‌లో పవన్ కల్యాణ్‌కు సైనస్ (Functional Endoscopic Sinus Surgery – FESS) సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల సూచన మేరకు దాదాపు 15 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న ఆయన, ఇటీవల తన నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

శస్త్రచికిత్స తర్వాత పవన్ బయటకు రావడం ఇదే మొదటిసారి. ఈ భేటీలో సీఎం చంద్రబాబు ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫెక్షన్ కంటిపై కూడా ప్రభావం చూపడంతో ఈ సర్జరీ అనివార్యమైందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం.