విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు.

0
3

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ, అభివృద్ధిలో ఒక చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు.

రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర కృషి, పట్టుదల వల్లే ఈ కల సాకారమైందని లోకేష్ పేర్కొన్నారు. ఈ జోన్ ఏర్పాటుతో రైల్వే మౌలిక సదుపాయాలు బలపడి, ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.