మంత్రి వివేక్ వెంకటస్వామి ని కలిసిన నేతకానీ సంఘం నాయకులు

0
6

హైదరాబాద్, మే 11: నేతకాని (మహర్) సేవా సంఘం ప్రతినిధులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి G. Vivek Venkataswamyను కలిసి ప్రభుత్వ గెజిట్, అధికారిక రికార్డుల్లో “నేతకాని” కుల పేరును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొన్ని పత్రాల్లో “మలసాలె/నెట్కాని”గా తప్పుగా నమోదవుతోందని, దీనివల్ల సమాజ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి సమర్పించిన వినతిపత్రంలో నేతకాని కుల ప్రజలు రాష్ట్రంలోని పలు జిల్లాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.