నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’కు అర్హుడని, ఆయన అద్భుత నటనకు ‘భాస్కర్ అవార్డు’ గ్యారంటీ అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కడప కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొంత తల్లిని, చెల్లిని తరిమేసి, బాబాయిని లేపేసిన జగన్, రాయలసీమకు పట్టిన ‘క్యాన్సర్ గడ్డ’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
2029 లోగా కడప స్టీల్ ప్లాంట్లో కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఫేక్ ఖాతాలతో కుట్రలు చేస్తోందని, శ్రేణులంతా అప్రమత్తంగా ఉండి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం లోకేష్ 89వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించి అర్జీలను స్వీకరించారు.










