గురువారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హార్సిలీ హిల్స్ నందు నిర్వహించిన మహానాడు సన్నాసి సమావేశంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సమావేశానికి తంబళ్లపల్లె పరిశీలకులు శ్రీ గణేష్ రెడ్డి గారు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీమతి పర్వీన్ తాజ్ గారు హాజరై పార్టీ శ్రేణుకు దిశా నిర్దేశం చేశారు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జిలు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు .
పెద్ద ఎత్తున పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ప్రతి కార్యకర్త గుండెల్లో నిలుపుకోవాలని పిలుపునిచ్చారు యువతలో నూతన ఉత్సాహం నింపుతూ పార్టీ భవిష్యత్తును బలోపేతం చేస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నాయకత్వం టిడిపికి మరింత బలాన్ని ఇస్తుందని కొనియాడారు










