బిక్షపతి సేవలు అనన్యం: ఎమ్మెల్యే ఐలయ్య

0
5

రాజపేట మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం బిక్షపతి గౌడ్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే కాల్వపల్లి చేరుకుని, భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా కప్పి పూలమాలలతో నివాళులర్పించారు. బిక్షపతి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీకి మరియు గ్రామానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నమిలే మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ నాయకులు బుడిగే పెంటయ్య గౌడ్, సర్పంచ్ ఇంజ లక్ష్మి, నాయకులు సిల్వేరు బాలరాజు గౌడ్, రంగ నరేష్ గౌడ్, భీమగాని బాలనరసయ్య, ఇంజ నరేష్ మరియు కాల్వపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.