అమెరికా దాడిలో వైజాగ్ మెరైన్ ఇంజినీర్ మృతి: సీఎం చంద్రబాబు విచారం

0
0

అమెరికా దాడిలో వైజాగ్ మెరైన్ ఇంజినీర్ మృతి: సీఎం చంద్రబాబు విచారం

ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన అమెరికా క్షిపణి దాడిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి చెందడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సురేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం, కేంద్ర అధికారులతో ఏపీ భవన్ సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.