చర్చి ధ్వంసంపై పోలీసుల నిర్లక్ష్యం: పాస్టర్ సంఘాల ఆగ్రహం
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో పదేళ్లుగా సేవలు అందిస్తున్న పాస్టర్ కోడి దానం నిర్మించిన ప్రార్థనా మందిరాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిందితుల పేర్లు లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పాస్టర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఆ తర్వాత చర్చి సామాగ్రి దొంగిలించడమే కాకుండా, బస్టాండ్‌లో పాస్టర్‌పై భౌతిక దాడికి పాల్పడినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. పైగా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని ఎస్ఐ వెంకటరమణయ్య బెదిరిస్తున్నారని మండిపడ్డారు. క్రైస్తవులపై జరుగుతున్న ఈ అన్యాయంపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని పలు పాస్టర్ల అసోసియేషన్ల నాయకులు డిమాండ్ చేశారు.










