అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శుక్రవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇరికిపెంట దిడ్డివారిపల్లి సచివాలయం పరిధిలో భారతం మిట్ట, వడ్డీపల్లి గ్రామాలలో ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. లార్వా ఉన్న నీటిని బయటకు పారబోసి, కొన్ని చోట్ల అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు, ఫ్రైడే డ్రైడే గురించి ప్రజలకు ఆరోగ్య విద్యను బోధించారు. ఈ కార్యక్రమంలో డా. రాజ్ కుమార్ నాయక్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, సీహెచ్‌ఓ అమర్నాథ్, వసంత కుమార్, సుధాకర్, శాంభవి, రోజా, మదనిక, గీత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










