శేరిలంకలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం.. పలువురికి ఉచిత ఆపరేషన్లు

0
0

కే. గంగవరం మండలం, శేరిలంక గ్రామంలో మామ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో, కొండేపూడి అర్జున్ సహకారంతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 14-06-2026న విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ శిబిరంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స మరియు ఆపరేషన్ కోసం ఎంపిక చేసింది. శిబిరంలో గుర్తించిన రోగులను 15-06-2026న కాకినాడలోని శ్రీ కిరణ్ ఐ హాస్పిటల్ కు తరలించి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మామ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎం.ఎస్. మహాశయ స్వయంగా రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఆపరేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి, మామ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎం.ఎస్. మహాశయ , అలాగే కొండేపూడి అర్జున్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

“ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని” నిర్వాహకులు తెలిపారు.