త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో పర్యాటక ప్రదేశ యోగా|

0
2

యోగా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో ‘పర్యాటక ప్రదేశ యోగా’ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్.పి శ్రీనివాసులు గారు, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వేల సంవత్సరాల క్రితమే భారతదేశం యోగా గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిందన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకుంటున్నాయని వివరించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగ ఉత్తమమైన మార్గమని కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి మెరుగైన జీవన విధానానికి బాటలు వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా త్రిపురాంతకేశ్వర స్వామి కొండపై కలెక్టర్, అధికారులు మొక్కలు నాటి ప్రజలకు స్ఫూర్తిని అందించారు.