“ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన.”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 293వ డివిజన్ సూరారంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన బీఎల్‌ఓలతో కలిసి కార్యక్రమాన్ని సమీక్షించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా ఇంటింటికీ వెళ్లి విధులు నిర్వహించాలని సూచించారు.
ఓటరు జాబితాలో ఖచ్చితత్వం కోసం అవసరమైన వివరాలను సేకరించాలని, ప్రజలు ఎన్యుమరేషన్ ఫారమ్‌ను సక్రమంగా నింపి సమర్పించాలని కోరారు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#Sidhumaroju










