మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ధొడ్డి కొమురయ్య చేసిన త్యాగాలు చిరస్మరణీయమని,ఆయన స్పూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి CH.సాయిశ్రీజ ,జిల్లా అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, IDOC కార్యాలయ సిబ్బంది మరియు జిల్లాలోని గొల్ల, కురుమ , వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.










