కానిస్టేబుల్ మృతి: రూ. లక్ష సాయం అంత్యక్రియలు|

0
0

అన్నమయ్య జిల్లాలోని టి. సుండుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46) అనారోగ్యంతో మరణించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు తీవ్ర సంతాపం తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు, మృతుని కుటుంబానికి ₹1 లక్ష నగదు సాయం అందజేశారు. రాయచోటి మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో పోలీసు అధికారులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో అధికార లాంఛనాలతో, ఏఆర్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.