బాబాపూర్: రోడ్డుకు రెడీమిక్స్ కంకర వేయించిన సర్పంచ్|

0
45

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామపంచాయతీ లోని ఇటీకాలలో రోడ్డుపై పేరుకుపోయిన బురదను తొలగించి, రోడ్డుకు రెడీ మిక్స్ కంకర వేయించే పనులను గ్రామ సర్పంచ్ శ్రీ సత్ర వేణి రాజన్న దగ్గరుండి చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై బురద ఎక్కువగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు విన్నవించారు.గ్రామస్థుల అభ్యర్థన మేరకు సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న, ఉపసర్పంచ్ శ్రీమతి అయిలవేణి లక్ష్మీ కిష్టయ్యలు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురికి కాలువలను తవ్వి, నిలిచిన బురదను పూర్తిగా తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డుపై రెడిమిక్స్ కంకరను వేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని పనులను విజయవంతం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించి రెడీ మిక్స్ కంకర వేయించినందుకు సర్పంచ్ గారికి స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.