మంచిర్యాల: పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద మున్సిపల్ కార్పొరేషన్, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నిమజ్జన శోభాయాత్రను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. గూడెం గోదావరిలో నిమజ్జనానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్ తూముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.









