● అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన బీఆర్‌ఎస్ నేత అనిల్ కిషోర్ గౌడ్
● సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి
అల్వాల్, సెప్టెంబర్ 28: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పద్మావతి కాలనీలో నాలా ప్రహరీ గోడ కూలిన విషయాన్ని బీఆర్‌ఎస్ నాయకుడు అనిల్ కిషోర్ గౌడ్ ఎంఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కూలిన ప్రహరీ గోడతో ఏర్పడిన సమస్యను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రావు, కాలనీ వాసులు నర్సింగ్, సత్యనారాయణ, శర్మ, బీఆర్‌ఎస్ నాయకులు దేవయ్య గౌడ్, మోసిన్, విజయశేఖర్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










