ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.

0
2

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని అందించి, వేదాశీర్వచనం పలికారు.

 

దసరా ఉత్సవాల ఏర్పాట్లపై చంద్రబాబు ఆరా తీశారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఆలయ ఈవో శీనా నాయక్‌, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.