శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం… టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి.

0
3

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడకు బయలుదేరిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ దానిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ హఠాత్పరిణామంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

 

వివరాల్లోకి వెళితే.. 591 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 45 మంది ప్రయాణికులతో శంషాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరింది. విమానం గగనతలానికి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. వారి అనుమతితో విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.