Madanapalle: అక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పర్యటనపై కాంగ్రెస్ నాయకుడు రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు.

0
2

Madanapalle: అక్టోబర్ 2న మదనపల్లెలో అగ్రికల్చరల్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనంత్ అంబానీ తదితరులు విచ్చేయనున్న నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అగ్రికల్చరల్ హబ్‌కు సంబంధించి ఇప్పటివరకు జిల్లా పరిపాలన, కలెక్టర్ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని మదనపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన అభివృద్ధి, కార్యకలాపాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.