తుఫాన్ ప్రభావంతో కొట్టుకుపోయిన బొబ్బిలి గిరిజన ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలోని ఆనకట్టను ఎమ్మెల్యే పరిశీలించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆనకట్ట పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆనకట్ట పునర్నిర్మాణానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.










