సంప్రదాయ వైభవంతో ఎంగిలిపూల బతుకమ్మ.|

0
13

● వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి మమత, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి

అల్వాల్, అక్టోబరు10:తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవానికి, ప్రకృతి ఆరాధనా పరంపరకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అల్వాల్‌లో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి. 

శనివారం రాత్రి నిర్వహించిన ఈ సంబరాల్లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సతీమణి మమత రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి వేడుకల్లో సందడి చేశారు.

వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను సుందరంగా పేర్చి మహిళలు ఉత్సాహంగా సంబరాల్లో పాలుపంచుకున్నారు.

సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. పుష్పాల సౌరభం, జానపద గీతాల మాధుర్యం వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చాయి.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సామూహిక ఐకమత్యానికి, ప్రకృతితో మానవ జీవనానికి గల అవినాభావ సంబంధానికి ఎంగిలిపూల బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుంది. 

తరతరాలుగా సంక్రమిస్తున్న ఈ సాంస్కృతిక వారసత్వాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయానురక్తితో కొనసాగిస్తూ తెలంగాణ అస్తిత్వ వైభవాన్ని చాటిచెప్పారు.

#Sidhumaroju

Alwal