కుసర్లపూడి లో వైసీపీ వర్గం టిడిపిలో చేరిక

0
3

 అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామంలో వైసీపీ వర్గం మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరింది. చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ కొల్లు సన్యాసినాయుడు దంపతులు, మాజీ వైస్ ప్రెసిడెంట్ సబ్బవరపు కాశి, మాజీ అధ్యక్షుడు రుత్తల శ్రీరామ, సబ్బవరపు శ్రీనివాసరావు, ఆవు గడ్డి శ్రీరామ్మూర్తి, ఆవు గడ్డి పెద్ది నాయుడు తమ అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న పెంచిన పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ వంటి సంక్షేమ పథకాలు, గ్రామ అభివృద్ధి చూసే చేరుతున్నామని వారు చెప్పారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.