ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డులో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

0
13

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఏళ్ల నాటి సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.