● అర్ధరాత్రి సామాన్య మహిళగా రోడ్డుపైకి వచ్చి భద్రతపై స్వయంగా పరిశీలన
● ఏపీ తొలి మహిళా డీఎస్పీగా చరిత్ర.. మల్కాజిగిరి తొలి మహిళా సీపీగా ప్రత్యేక గుర్తింపు
● బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో ప్రజల ప్రశంసలు
అల్వాల్,నవంబర్16:మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి, ఐపీఎస్ జన్మదినం సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విధి నిర్వహణలో ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల బాధ్యతకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్న ఆమె ప్రస్థానం ప్రత్యేకంగా నిలుస్తోంది.
మహిళల భద్రతపై కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, అర్ధరాత్రి సామాన్య మహిళలా రోడ్డుపైకి వచ్చి పరిస్థితులను స్వయంగా పరిశీలించడం ఆమె కార్యాచరణలోని ప్రత్యేకతను చాటిచెప్పింది.
ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా డీఎస్పీగా చరిత్ర సృష్టించిన ఆమె, ప్రస్తుతం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ తొలి మహిళా సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పదవులు అలంకారం కోసం కాదు.. ప్రజలకు భరోసా కల్పించేందుకు అనే విధంగా ఆమె చేపడుతున్న కార్యక్రమాలు పోలీసు అధికారుల బాధ్యతను గుర్తుచేస్తున్నాయి.
ప్రజలకు భద్రత.. మహిళలకు భరోసా.. విధి నిర్వహణలో నిబద్ధత.. ఇవే సీపీ సుమతి గారికి ఈ జన్మదినం సందర్భంగా అందించే అభినందనలు.
#Sidhumaroju
Alwal









