మంచిర్యాల నియోజకవర్గం | గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో, స్థానిక నాయకులతో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ముఖ్యంగా భక్తులకు తాగునీటి సౌకర్యం, భోజన ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పండుగను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
భక్తుల సౌకర్యమే ప్రాధాన్యత.. పండుగ నిర్వహణలో సమన్వయమే కీలకం!
ఈ కార్యక్రమంలో ఆలయ EO శ్రీనివాస్, DCP భాస్కర్, MPDO ప్రసాద్, MRO రోహిత్, ACP ప్రకాష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ బిర్లాగురి శంకరయ్య, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










